మోదీ,షా భ్రమల్లో బతుకుతూ... దేశాన్నీ భ్రమల్లో ఉంచుతున్నారు : రాహుల్
తిరువనంతపురం : దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కేంద్ర ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మోదీ,షా తమ సొంత భ్రమల్లో బతుకుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో రాహుల్ పర్యటిస్తున్నారు. దేశంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభం లేదన్న బీజేపీ ప్రచారంపై ఆయన భగ్గుమన్నారు.
''తమ సొంత భ్రమల్లో మోదీ,షా బతుకుతున్నారు. వారికి బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేదు. వారు తమ సొంత ఊహల్లో బతుకుతున్నారు. అందుకే దేశం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది'' అని ఆరోపించారు. ప్రజల యొక్క బాగోగులను, సమస్యలను ప్రధాని సావధానంగా వింటే దేశంలో ఎలాంటి సమస్యా తలెత్తదని, వారు భ్రమల్లో బతుకుతూ, దేశ ప్రజల్నీ అలాగే బతకమని చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు.