బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ నటించిన తాజా చిత్రం భాగీ-3. యాక్షన్ మూవీగా శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద శుభారంభం చేసింది. అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. హోళీ సీజన్ బరిలో దిగి.. ప్రపంచ వ్యాప్తంగా రూ 17. 50 కోట్లు సాధించి.. తన్హాజీ రికార్డును బ్రేక్ చేసింది. తన్హాజీ మొదటిరోజు రూ. 15.10 కోట్లు వసూలు చేయగా భాగీ 3.. 17.50 కోట్లు సాధించింది. కాగా అభిమానులను అలరించిన ఈ సినిమా విమర్శకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. (‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!)
ఓ వైపు దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే అవేవీ పట్టించుకోకండా బరిలో దిగిన భాగీ3 పై కరోనా ప్రభావం ఎంతమాత్రం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జేమ్స్ బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రేగ్ నటించిన ‘నో టైమ్ టు డై’ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏడు నెలల పాటు ఈ సినిమాను వాయిదా వేయడంతో భాగీ సినిమాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. లేకుంటే భాగీ కలెక్షన్లలో భారీ కోత ఏర్పడేదని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ఫ్రాఫ్‌తో కలిసి మొదటి సారి నటించారు. సినిమాలో కూడా వారు తండ్రి, కొడుకులుగా నటించడం విశేషం. అదే విధంగా రితేష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. (అదిరిపోయిన ‘భాగీ-3’ ట్రైలర్)