న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది కూడా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వీడియోను షేర్ చేశాడు. అయితే ఇది కరోనా వైరస్‌పై సెహ్వాగ్ మాట్లాడిన వీడియో కాదు.. ఒక బుడతడు తన బుజ్జి బుజ్జి మాటలతో ఏం చేయాలో తెలియజేశాడు. ఈ వీడియో సెహ్వాగ్ కంటబడటంతో దాన్ని తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.అంతే కాదు.. ఆ చిన్నారి చెప్పే మాటల్ని శ్రద్ధగా ఆలకించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ‘ ఇది మనందరికీ చాలా ముఖ్యమైనది. ఆ చిన్న పిల్లాడు ఎంతో అందంగా కరోనా వైరస్ నియంత్రణ గురించి వివరించాడు. వాడి మాటలు ప్రతీ ఒక్కరూ వినండి.. అలానే పాటించడం కూడా మానకండి’ అని కామెంట్ కూడా జత చేశాడు. (అది ‘మాస్టర్’ ప‍్లాన్: సెహ్వాగ్)
కరోనాపై బుడతడి క్లారిటీ.. సెహ్వాగ్ ఫిదా