చెన్నై: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందికి పిచ్చి ముదిరి హాస్పిటల్ పాలవుతుంటే, మరికొందరేమో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తమిళనాడులోని చెంగల్పట్లులో ముగ్గరు మందుబాబులు మద్యం దొరకట్లేలేదని పెయింట్, వార్నిష్‌తో కలిపి సేవించారు. దీంతో తీవ్ర అనారోగ్యం చెంది మరణించారు. వీరిని శివశంకర్, ప్రదీప్, శివరామన్‌లుగా గుర్తించారు. ప్రతిరోజు మద్యం తాగే అలవాటున్న వీరు గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయారు. దీంతో విసుగు చెంది ఆదివారం పేయంట్‌తో కలిపిన వార్నిష్‌ను తాగారు. అంతే కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో ముగ్గురు మందుబాబులు మృతి